కొబ్బరి నీళ్లని ఉదయమే తాగటం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. దీంతో బద్దకం, నిద్ర వంటివి రావు.
పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి కావల్సినంత పొటాషియం లభిస్తుంది, దీంతో శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ తగ్గుతుంది దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
కొబ్బరి నీళ్లను పరగడుపున తాగితే ఈ సీజన్లో వచ్చే జీర్ణ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.