పులిపిర్లు అనేది సాధారణ చర్మ సమస్య, హెచ్ పి బి అనే వైరస్ కారణంగా మన చర్మం ఫై పులిపిర్లు ఏర్పడుతాయి. పులిపిర్ల వల్ల మనకు ఎటువంటి నొప్పి ఉండదు. వీటిని తొలగించుకోటానికి కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం,
బొప్పాయి పాలను పులిపిర్లపై రాస్తే అవి ఊడిపోతాయి.
సున్నం, బెల్లం కలిపి అవి ఉన్న చోట పెడితే ఫలితం ఉంటుంది.
రెడ్డివారి నానుబాలు చెట్టుకొమ్మలను తెంపితే వచ్చే పాలను పులిపిర్ల మీద రాయాలి, ఇలా నాలుగు లేదా ఐదు సార్లు రాస్తే పులిపిర్లు ఇట్టే రాలిపోతాయి.
అరటిపండు తొక్కకు ఉండే నారవంటి పదార్ధం పులిపిర్ల మీద రాసినా తగ్గుముఖం పడుతాయి.
వెల్లుల్లి రెమ్మలను పులిపిర్లపై రుద్దితే పులిపిర్లు తగ్గుతాయి.
రావి చెట్టు బెరడును కాల్చగా వచ్చిన బూడిదను సున్నం, వెన్న సమానంగా కలుపుకొని పులిపిర్ల పై రోజు రాస్తూ ఉంటే క్రమంగా రాలిపోతాయి.