తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. మూడు తాటిముంజలు తీసుకొంటే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. లేత తాటిముంజల్లో దాదాపు 80 శాతానికి పైగా నీరుంటుంది, కావున వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయిన నీటిని పొందవచ్చు.
వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
తాటిముంజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, బరువుని అదుపులో ఉంచుకోవాలనేవారికి చక్కటి ఆహారం.
శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటం వల్ల వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఎండవల్ల కలిగే అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి.
అజీర్తి, అసిడిటీ, మలబద్దకం, కడుపులో మంట సమస్యలు దూరం అవుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి.