LATEST UPDATES
Showing posts with label coconut. Show all posts
Showing posts with label coconut. Show all posts

Saturday 7 May 2022

తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of ICE APPLE

          తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. మూడు తాటిముంజలు తీసుకొంటే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. లేత తాటిముంజల్లో దాదాపు 80 శాతానికి పైగా నీరుంటుంది, కావున వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయిన నీటిని పొందవచ్చు.

వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 

తాటిముంజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, బరువుని అదుపులో ఉంచుకోవాలనేవారికి చక్కటి ఆహారం.

శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటం వల్ల వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఎండవల్ల కలిగే అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి.

అజీర్తి, అసిడిటీ, మలబద్దకం, కడుపులో మంట సమస్యలు దూరం అవుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి.





Thursday 7 April 2022

ఎసిడిటీకి చెక్ పెట్టే చిట్కాలు


ఎసిడిటీ మొదలైనప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగటం వల్ల ఫలితం ఉంటుంది.

నీళ్లలో పుదీనా ఆకులు వేసి, మరిగించి తేనె కలిపి తాగాలి.

నీళ్లలో స్పూను జీలకర్ర వేసి  మరిగించి తాగాలి.

ఎసిడిటీ మొదలవగానే నోట్లో లవంగాలు వేసుకొని, నములుతూ రసం మింగుతూ ఉండాలి, అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.  ఇలా చేస్తే ఎసిడిటి సమస్య తగ్గుతుంది.

దానిమ్మ, అరటిపళ్ళు, ఆప్రికాట్స్, కొబ్బరి ఎసిడిటీ కి విరుగుడుగా పని చేస్తాయి.


@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates