అరికాళ్ళ పగుళ్లు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు, అత్యంత సాధారణ కారణం చర్మం పొడిబారడం. ఎక్కువసేపు నిలబడి ఉండటం, తామర, సోరియాసిస్ లేదా అథ్లెట్స్ ఫుట్ వంటి కొన్ని చర్మ పరిస్థితులు మరియు అధిక బరువు వల్ల చర్మం పొడిబారడం జరుగుతుంది.
అరికాళ్ళ పగుళ్ళని నయం చేయడంలో సహాయపడే మార్గాలు:
1. రాత్రి నిద్రపోయేముందు కాలి పగుళ్ళకి కొబ్బరినూనె పూయాలి, పగుళ్లు ఉన్న చోట మర్దన చేయాలి.
2. అలోవెరా జెల్ తో పాదాల పగుళ్ళకు రుద్దాలి, దీనివల్ల పగుళ్లు మాయం అవుతాయి.
3. గోరువెచ్చని నీటిలో కాళ్ళని పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.
4. ఒక టబ్ లో నీళ్ళు పోసి అందులో నిమ్మరసం పిండాలి, పగిలిన కళ్ళను ఆ నీళ్ళలో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి.
పగిలిన మడమలను నివారించే మార్గాలు:
1. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజ్ చేయండి.
2. షవర్ వాటర్ గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి.
3. మీ పాదాలను స్క్రబ్ చేయవద్దు.