గోధుమ గడ్డి లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. గోధుమ గడ్డి రసం (లేదా) పొడిని నీటిలో కలుపుకొని ప్రతి రోజూ తాగితే రక్తహీనత, రక్తపోటు తగ్గుతుంది. ఊబకాయ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. జీర్ణక్రియ సమర్ధంగా పనిచేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు దరి చేరవు. పేగుల్లో మంట తగ్గుతుంది. అలర్జీ సమస్యలున్నవాళ్ళు దీన్ని తీసుకోకపోవటం చాలా ఉత్తమం. ఇందులో జింక్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో వాపులను తగ్గిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోధుమ గడ్డిని ఇంట్లోనే పూల కుండీల్లో పెంచుకోవచ్చు.