Monday, 11 April 2022
Beauty Tips
Monday, 10 January 2022
గోధుమ గడ్డి తో ఉపయోగాలు
గోధుమ గడ్డి లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. గోధుమ గడ్డి రసం (లేదా) పొడిని నీటిలో కలుపుకొని ప్రతి రోజూ తాగితే రక్తహీనత, రక్తపోటు తగ్గుతుంది. ఊబకాయ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. జీర్ణక్రియ సమర్ధంగా పనిచేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు దరి చేరవు. పేగుల్లో మంట తగ్గుతుంది. అలర్జీ సమస్యలున్నవాళ్ళు దీన్ని తీసుకోకపోవటం చాలా ఉత్తమం. ఇందులో జింక్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో వాపులను తగ్గిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోధుమ గడ్డిని ఇంట్లోనే పూల కుండీల్లో పెంచుకోవచ్చు.
Wednesday, 29 December 2021
Health Tips
# ఖర్జూరంతో ప్రయోజనాలు
మలబద్దకాన్ని నివారించటానికి ఖర్జూరాలు ఉపకరిస్తాయి.
ఒక కప్పు ఖర్జూరాల్లో 12 గ్రాముల ఫైబర్ (పీచుపదార్థం) ఉంటుంది. ఇది రోజువారీ పీచు పదార్థం లో 48 శాతం భర్తీ చేస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
Health Tips
1) ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లలో మరిగించి తాగితే తల తిరగటం, తల నొప్పి తగ్గుతాయి.
2) 6 టీస్పూన్ల చొప్పున గులాబీ రేకులు, సోపు గింజలు కలిపి రెండు కప్పుల నీళ్లలో మరిగించి, రోజుకు రెండుసార్లు తీసుకొంటే క్రమంగా రక్తహీనత తగ్గుతుంది.