- బ్లాక్ టీ తాగడం వలన చర్మంపై ముడతలు తగ్గి వయసు కనిపించదు.
- చర్మం ఫై మచ్చలు,వాపులు తగ్గిస్తుంది.
- చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది.
Saturday, 1 January 2022
బ్లాక్ టీ తాగడం వలన ప్రయోజనాలు
Wednesday, 29 December 2021
Health Tips
# ఖర్జూరంతో ప్రయోజనాలు
మలబద్దకాన్ని నివారించటానికి ఖర్జూరాలు ఉపకరిస్తాయి.
ఒక కప్పు ఖర్జూరాల్లో 12 గ్రాముల ఫైబర్ (పీచుపదార్థం) ఉంటుంది. ఇది రోజువారీ పీచు పదార్థం లో 48 శాతం భర్తీ చేస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
Health Tips
1) ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లలో మరిగించి తాగితే తల తిరగటం, తల నొప్పి తగ్గుతాయి.
2) 6 టీస్పూన్ల చొప్పున గులాబీ రేకులు, సోపు గింజలు కలిపి రెండు కప్పుల నీళ్లలో మరిగించి, రోజుకు రెండుసార్లు తీసుకొంటే క్రమంగా రక్తహీనత తగ్గుతుంది.
ఉప్పు ఎక్కువగా తీసుకొంటే?
అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తారంట, ఎలుకలపై చేసిన ప్రయోగం వల్ల ఈ విషయం వెల్లడయ్యింది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు అధికంగా తీసుకోవటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇక వేసవి లో ఉప్పు పూర్తిగా తగ్గించటం మంచిది. ఉప్పు తక్కువగా తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనని తగ్గిస్తుంది.
Monday, 27 December 2021
గోంగూరతో అదిరే బెనిఫిట్స్.!
గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది.
గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
దీనిలోని విటమిన్ A వలన కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి.
గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినిరల్స్ అధికం, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి.
దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది.
రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.
ఆయుర్వేద చిట్కాలు
ప్రతి రోజూ ఉదయం ఒక తమలపాకులో 10 మిరియాల గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి. ఇలా 2 నెలలు చేస్తే స్థూలకాయం తగ్గుతుంది.
ముక్కు దిబ్బడ వేదిస్తున్నప్పుడు ఒక చుక్క ఉల్లిరసంని నాసికారంద్రాల్లో వేస్తే ఉపశమనం కలుగుతుంది.
వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్బి ..... ఆ పేస్ట్ ను కాలిన గాయాలపై రాస్తే మంట తగ్గుతుంది.
కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒక సారి తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది, ఇందులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి సమస్యలు నయం అవుతాయి.
Thursday, 23 December 2021
ఎండుద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
రాత్రిపూట ఎండుద్రాక్షల్ని నానబెట్టుకొని ఉదయం తింటే బరువు తగ్గుతారు.
ఎండుద్రాక్షలో ఉండే గ్లూకోస్ శరీరానికి శక్తినిచ్చి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోజూ కొన్ని ఎండుద్రాక్షల్ని పాలల్లో నానబెట్టుకొని తినటం వల్ల ఎముకలు బలపడతాయి.
ఎండుద్రాక్షల్ని తినటం వల్ల జీర్ణవ్యవస్థ మరింత మెరుగుపడి మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
ఒకవేళ ఇది మీకు నచ్చితే : ద్రాక్ష పండిద్దామా