--> ఆలుగడ్డలు చల్లని నీటిలో వేస్తే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది.
--> అరటిపండ్లు కవర్ లో ఉంచకండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయట తీసి విడివిడిగా పెట్టండి.
--> పేపర్లో చుట్టి పెడితే ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
--> కోడిగుడ్లను ఉడికించిన తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపితే పెంకులన్ని సులువుగా పగులుతాయి.
--> ఆపిల్ పండు ముక్కలు కొస్తే కొద్దిసేపటికి రంగు మారతాయి. దీంతో తినాలమీపించాడు. అలాకాకుండా ఆపిల్ ముక్కలపై నిమ్మరసం పిండితే చాలా సేపటి వరకు తాజాగా, రంగు మారకుండా ఉంటాయి. తినేటప్పుడు కడుక్కొని తింటే పులుపు తగలదు.
--> కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు.
--> అగరుబత్తి నుసితో ఇత్తడి పాత్రలు కడగటం వాళ్ళ బాగా శుభ్రపడుతాయి.
--> కత్తిపీటకు ఉప్పు రాయటం వల్ల పదునుగా తయారవుతుంది.
--> మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్ళలో ఇనుప వస్తువు ఏదైనా చేయాలి.
--> బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.
No comments:
Post a Comment