నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) సాధారణంగా అందరికీ వస్తుంటాయి. నాలుకతో పాటు పెదవుల లోపలి భాగంలో పొక్కులు కనిపిస్తాయి. దీంతో కొంచెం కారం తగిలినా తట్టుకోలేరు. నోటి పుండ్లు ఎలాంటి హాని కలిగించవు, అయితే డాక్టర్ అవసరం లేకుండా ఇంట్లో చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
తేనే, పసుపు కలిపి పూతపై రాయటం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది (నోటిపూత తగ్గుతుంది.)
కొబ్బరి నూనె అప్లై చేయటం లేదా పచ్చికొబ్బరి నమలడం.
నోటిపూత ఉన్నచోట నెయ్యి రాయటం.
ప్రతిరోజూ రెండు మూడు సార్లు మజ్జిగ తాగటం.
రోజుకు నాలుగైదు సార్లు తులసి ఆకులు నమలడం వల్ల తులసి ఆకుల నుంచి వచ్చే రసం నోటి పుండ్లు త్వరగా నయం అయ్యేలా చేస్తుంది.
పటిక బెల్లం 8 గ్రాములు, కర్పూరం 1 గ్రాము తీసుకుని మెత్తగా నూరి నోటిపై పుండ్లు ఉన్న చోట రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఒక చెంచా గసగసాలు పొడిచేసి, దానానికి ఒక చెంచా చక్కెరను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవాలి, ఇలా చేయటం వల్ల ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య తగ్గుతుంది.
గమనిక: ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు అధ్యయనాల ద్వారా అందించబడ్డాయి. ఈ వ్యాసం మీ అవగాహన కోసమే. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమ మార్గం. గమనించగలరు.
No comments:
Post a Comment