పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు దూరమౌతాయి. దగ్గు కు చెక్ పెడుతుంది.
పుదీనా వాసన మెదడును ఉత్తేజపరుస్తుంది, చురుగ్గా పని చేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి ఉపయోగ పడుతుంది. డిప్రెషన్ ని మాయం చేస్తుంది.
తలకు పుదీనా రాస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. తల చల్లగా ఉంటుంది.
అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
పుదీనాలోని పాలిఫినాల్స్ కడుపులోని గ్యాస్ ని తగ్గిస్తాయి.
చలికాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుండి నివారణ లభిస్తుంది.
పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం, ఫాస్పరస్ లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పుదీనా తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
పుదీనా ఎంజైమ్ లను ప్రేరేపించి జీర్ణవ్యవస్తను ఉత్తేజపరుస్తుంది. మలబద్దకాన్ని దరి చేరనీయదు.
పుదీనా తింటే నోటి దుర్వాసన పోగొడుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలకు పుదీనా తో చెక్ పెట్టొచ్చు.
పుదీనా తో జుట్టు సమస్యల పరిష్కారం
పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకొంటే జుట్టు రాలటం క్రమంగా తగ్గుతుంది.
పుదీనా నూనెతో చుండ్రు తొలగి జుట్టు బలంగా తయారుఅవుతుంది, పుదీనా నూనె జుట్టు చివర్లకు రాసుకొంటే చివర్లు చిట్లకుండా ఉంటాయి.
పుదీనా నూనె జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తుంది.
No comments:
Post a Comment