1) బొంబాయి రవ్వ, పాలు, పసుపు కలిపి ముఖానికి రాసుకొని పది నిముషాల తర్వాత కడిగేస్తే.. చలికాలంలో చర్మం నునుపుగా తయారవుతుంది.
2) బాగా పండిన బొప్పాయి గుజ్జు అర కప్పు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి. దీంతో చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్ రావడంతో పాటు పైన పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము, ధూళి వదులుతుంది.