LATEST UPDATES
Showing posts with label skin care. Show all posts
Showing posts with label skin care. Show all posts

Saturday 7 May 2022

సోంపు గింజల తో ప్రయోజనాలు

సోంపు గింజలు (fennel seeds)  తింటే జింక్, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి.

రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది.

సోంపు తీసుకోవటం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మంపై వచ్చే దద్దుర్లు రావు.

సోంపు గింజలతో తయారుచేసిన పేస్ట్ ను ముఖంపై రాయటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

బరువు తగ్గదలచినవారికి సోంపు గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి, వీటిని తీసుకోవటం వల్ల జీవక్రియ పెరిగి, క్యాలరీలు త్వరగా కరుగుతాయి. తద్వారా బరువు తగ్గటం ప్రారంభమౌతుంది.

మహిళలకు పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి కలిగినప్పుడు సోంపు నీళ్లను తాగాలి, అప్పుడు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

భోజనం తరువాత సోంపు గింజలను నమలడం వల్ల నోరు శుభ్రంగా ఉండటంతో పాటు తిన్న ఆహారం కూడా జీర్ణం అవుతుంది. భోజనం చేశాక సోంపు తినటం వల్ల ఒంట్లో ఉన్న నీరంతా బయటికి పోతుంది, తద్వారా బరువు తగ్గుతారు.

త్రిదోష (వాత, పిత్త, కఫ ) సమస్యను తగ్గిస్తుంది. 



Monday 11 April 2022

Beauty Tips


1) బొంబాయి రవ్వ, పాలు, పసుపు కలిపి ముఖానికి రాసుకొని పది నిముషాల తర్వాత కడిగేస్తే.. చలికాలంలో చర్మం నునుపుగా తయారవుతుంది. 


2) బాగా పండిన బొప్పాయి గుజ్జు అర కప్పు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి.  దీంతో చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్ రావడంతో పాటు పైన పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము, ధూళి వదులుతుంది. 


@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates