రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది.
తెల్ల రక్తకణాల సామర్థ్యం పెరిగి ఇన్ఫెక్షన్లు బారినపడే అవకాశాలు తక్కువ ఉంటాయి.
బాదంలో ఉండే విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును నియంత్రిస్తాయి.
దీర్ఘకాలంగా ఉండే మలబద్దకం సమస్య తీరుతుంది.
రక్త ప్రసారం సవ్యంగా జరిగి గుండె జబ్బులు రావు.
బాదంపప్పులోని విటమిన్ B7, ఫోలిక్ ఆమ్లం క్యాన్సర్‌తో పోరాడుతాయి.
ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది.
బాదం పప్పును పొట్టు తోనే తింటున్నారా?
బాదం పప్పును పొట్టును తొలగించి తినటమే ఉత్తమం. బాదాం పొట్టులో టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాల శోషణలో అడ్డుపడతాయి. బాదం పప్పును నానబెట్టి తినటమే మంచిది, నానబెట్టటం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించే లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది, ఫలితంగా పోషకాల శోషణ మెరుగ్గా జరుగుతుంది. అధిక బరువు తగ్గాలనుకొంటే బాదం పప్పును నానబెట్టి, పొట్టును తొలగించి తినాలి.