1) కొన్ని పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో 20 నిముషాలు ఉంచి, చల్లబడిన తరువాత వాటితో పుక్కిలించాలి.
2) రోజూ రెండు పూటలా ఉప్పు నీళ్ళలో పుక్కిలిస్తే నోట్లో ఉండే క్రిములు, వ్యర్ధాలు తొలగుతాయి.
3) నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని (Clove) పెట్టి నెమ్మదిగా నొక్కి కొద్దిసేపు ఉంచితే ప్రయోజనముంటుంది. 3 నుంచి 4 లవంగాలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో రాసినా కూడా ఉపశమనం లభిస్తుంది.
4) అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవటం వళ్ళ తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ నుంచి వచ్చే రసం నొప్పిని తగ్గిస్తుంది.
5) వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు (లేదా) మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.