మీరు ఎంత అందంగా తయారు అయినా, మీ మోచేతుల నలుపు మీ రూపాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. మోచేతుల చుట్టూ ఉన్న చర్మం శరీరంలోని మిగిలిన భాగాల కంటే పలుచగా ఉన్నందున, ఇది కొన్నిసార్లు పొడిబారి, మందపాటి మరియు నల్లగా మారుతుంది.
నల్లని మోచేతుల కోసం అత్యంత ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు
1. తులసి ఆకులను మెత్తగా నూరి పాల మీగడ, పసుపు కలిపి రాత్రి పూట మర్దన చేయాలి. తరువాతి రోజు ఉదయం చల్లని నీళ్లతో కడిగేయాలి.
2. నిమ్మరసం
నిమ్మకాయ అత్యుత్తమ సహజ బ్లీచింగ్ ఏజెంట్. అప్పుడప్పుడు సగానికి కోసిన నిమ్మ చెక్కలతో మోచేతులపై మర్దన చేస్తుండాలి. అరగంట ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
3. కలబంద జెల్
మీ మోచేతులకు అప్లై చేయడం వల్ల వాటి చుట్టూ ఉన్న చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా పూర్తిగా తేమ చేస్తుంది. తాజా కలబంద ఆకు నుండి జెల్ ను తీయండి మరియు ప్రతి రోజు మీ మోచేతులకు మసాజ్ చేయండి. 20 నిముషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.
4. తేనె మరియు చక్కెర
తేనె లో చక్కెర కలిపి అప్పుడప్పుడు కలిపి రుద్దుకోవటం వళ్ళ కూడా నలుపు తగ్గుతుంది.5. శనగ పిండి లో పెరుగు కలిపి మోచేతులపై పూతలా వేసి ఆరాక కడిగేయాలి.
6. కొబ్బరి నూనె
గోరువెచ్చని కొబ్బరి నూనె లో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకోవాలి. తర్వాత సబ్బు మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. కొద్ది రోజుల్లో కనిపించే ఫలితాలను పొందడానికి ప్రతిరోజూ దీన్ని పాటించండి.