LATEST UPDATES

Sunday, 16 January 2022

స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఇలా చేయండి


మహిళ గర్భం దాల్చాలంటే పురుషుడి వీర్యం లో స్పెర్మ్ కౌంట్ సుమారు ౩౦ మిళియన్స్ పైగా ఉండాలని డాక్టర్స్ చెబుతున్నారు. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఆహారపు అలవాట్లతో పాటు మరి కొన్ని అలవాట్లు కూడా అలవరచుకోవాలి, అవి

1) సిగరెట్స్ కి దూరంగా ఉండాలి.

2) ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోరాదు.

3) పండ్లు,తాజా కూరగాయలు ఎక్కువగా తినాలి. గుడ్లు, బచ్చలి కూర, అరటి, డార్క్ చాక్లెట్ తినాలి.

4) అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.

5) ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజు 8 గంటలు నిద్రపోవాలి.


వీర్యకణాల సంఖ్య పెరగాలంటే

పండంటి పాపాయి పుట్టాలంటే స్త్రీలే కాదు పురుషులు కూడా సరైన ఆహారం తీసుకోవాలి.


వెల్లుల్లి:

దీని వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. వెల్లుల్లిలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషులు మరియు స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. సెలీనియం, వెల్లుల్లిలో ఉండే మరో ముఖ్యమైన ఎంజైమ్, స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరుస్తుంది.

అరటిపండు:


అరటిలో విటమిన్ బి 1 ,సి, ప్రోటీన్‌లు మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి, ఇవి స్పెర్మ్ యొక్క కదలికను పెంచుతాయి. అరటిపండ్లలో బ్రోమెలైన్ అనే అరుదైన ఎంజైమ్ కూడా ఉంటుంది, ఇది వీర్యకణాల సంఖ్యను మరియు చలనశీలతను పెంచడంలో సహాయపడుతుంది.

మెంతులు:

రోజూ 6౦౦ మిల్లి గ్రాముల మెంతులను 12 వారాల పాటు తీసుకొంటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. 

సంతానోత్పత్తిలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. జీడిపప్పులో జింక్ ఎక్కువగా లభ్యమవుతుంది.

ఆహారంలో రోగనిరోధక శక్తికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజాలు, ఫైబర్ మరియు విటమిన్లు ఉండాలి. బ్రకోలి, స్ట్రాబెర్రీ, పాలకూర, గుమ్మడికాయ గింజలు, క్యారెట్లు, డార్క్ చాక్లెట్ కూడా తినాలి.  



Thursday, 13 January 2022

పుట్టగొడుగులతో పుట్టెడు ప్రయోజనాలు

పోషకాలు మెండుగా ఉండే పుట్టగొడుగులు మంచి రుచి కలిగి ఉంటాయి. పుట్టగొడుగులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, ఇక పుట్టగొడుగులను సూపర్ ఫుడ్ గా డైటీషియన్స్ రెఫెర్ చేస్తున్నారు.


పుట్టగొడుగులు ఉండే పొటాషియం BPని నియంత్రిస్తుంది.

మేజిక్ మష్రూమ్, ఒక రకమైన పుట్టగొడుగులు, మహిళల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది.

పుట్టగొడుగులలో ఉండే ఫోటోట్రోపిక్ కారకం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

జీవక్రియల వేగం పెంచేందుకు తోడ్పడుతాయి.

బరువు తగ్గడంలో మష్రూమ్స్ బాగా పనిచేస్తాయి.

ఫైబర్, ప్రోటీన్ తో శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి.

మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లకు మష్రూమ్స్ దివ్యౌషదంలా పనిచేస్తాయి.

పుట్టగొడుగులలో ఉండే ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మహిళలు మష్రూమ్ సూప్ ను తరచుగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.








Monday, 10 January 2022

గోధుమ గడ్డి తో ఉపయోగాలు


గోధుమ గడ్డి లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. గోధుమ గడ్డి రసం (లేదా) పొడిని నీటిలో కలుపుకొని ప్రతి రోజూ తాగితే రక్తహీనత, రక్తపోటు తగ్గుతుంది. ఊబకాయ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. జీర్ణక్రియ సమర్ధంగా పనిచేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు దరి చేరవు. పేగుల్లో మంట తగ్గుతుంది. అలర్జీ  సమస్యలున్నవాళ్ళు దీన్ని తీసుకోకపోవటం చాలా ఉత్తమం. ఇందులో జింక్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో వాపులను తగ్గిస్తుంది.


ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోధుమ గడ్డిని ఇంట్లోనే పూల కుండీల్లో పెంచుకోవచ్చు.




Saturday, 1 January 2022

బ్లాక్ టీ తాగడం వలన ప్రయోజనాలు


  •  బ్లాక్ టీ తాగడం వలన చర్మంపై ముడతలు తగ్గి వయసు కనిపించదు.
  • చర్మం ఫై మచ్చలు,వాపులు తగ్గిస్తుంది.
  • చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది.


బ్లాక్ టీ తయారుచేయు విధానము.

బ్లాక్ టీ తయారు చేయడం కోసం మొదట రెండు కప్పుల నీటిని 5 నిముషాలు మరిగించాలి. ఆ మరిగిన నీటిలో కావలసినన్ని టీ ఆకులను వేసి మూతను వేసి మరల ఆ మిశ్రమాన్ని రెండు నిముషాలు మరిగించాలి. అప్పుడు ఆ నీటిని వడగట్టి తాగాలి.రుచి కోసం నిమ్మరసం తేనె మరియు అల్లం కలుపుకోవచ్చు. చలి కాలంలో ఈ టీ ని తాగడం వలన మంచి ఉతేజాన్ని ఇస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి దీనివలన ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నాము
@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates