LATEST UPDATES

Wednesday, 23 March 2022

రాగి జావ తాగటం వల్ల ప్రయోజనాలు

          మన పూర్వికులు చాలా రకాల జావాలను తయారు చేసుకొని తాగేవాళ్ళు, జావలు తాగటం వల్ల శరీరం లో నీటిశాతం పెరగటంతో పాటు శక్తి కూడా లభిస్తుంది. సాధారణంగా చాలా రకాల (రాగి, బార్లీ) జావ తయారు  చేసుకొంటుంటారు, మనం ఈ రోజు రాగి జావ ఎలా తయారు చేసుకోవాలి, దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకొందాం. 

రాగి జావ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగిపిండి, ఉల్లిపాయ, ఉప్పు, కొత్తిమీర

రాగిపిండి రెండు మూడు చెంచాలు తీసుకొని రెండు గ్లాసుల నీళ్లలో వేసి, తక్కువ మంటపై ఉడికించుకోవాలి, ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచి కోరుకొనేవాళ్ళు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఉడికించుకోవచ్చు. వేడి తగ్గకముందే ఈ రాగి జావను గిన్నె లో తీసుకొని తాగాలి. వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకొంటే కడుపులో చల్లగా ఉంటుంది. 

రాగుల్లో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది, అందువల్ల రాగిజావ తాగితే ఎముకలు దృఢంగా తయారుఅవుతాయి.

రాగుల్లో విటమిన్లు ఏ, బి, సి, ఖనిజాలు అధికంగా ఉంటాయి.

రక్తహీనతతో బాధపడేవారు రాగి జావ తీసుకోవటం చాలా మంచిది.

ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు రాగిజావ తాగటం చాలా మంచిది.


ఒకవేళ ఇది మీకు నచ్చితే: రాగుల సాగులో  మెళకువలు


No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates