LATEST UPDATES

Thursday 31 March 2022

వాము ఉపయోగాలు

వాము అన్నది మన వంటయింటిలో ఉండే సాదారణ మసాలా దినుసు, కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాముని అజ్వైన్ (AJWAIN) అని కూడా పిలుస్తారు. ఇంట్లో ఉండే వాముతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను దూరం  చేసుకోవచ్చని ఎంతోమంది నిపుణులు తెలియచేస్తున్నారు.

1) వాము తినడం వల్ల నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

2) వాము తినడం వల్ల (లేదా) వాము నీటిని తాగటం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది, వాములో ఉండే నియాసిన్ గుండె సంభందిత వ్యాధులని నివారిస్తుంది.

3) మైగ్రేన్ తలనొప్పికి చక్కటి మందులా వాము పనిచేస్తుంది, వాము పొడిని సన్నటి గుడ్డలో కట్టి, తరచూ వాసన పీల్చాలి, ఇలా చేయటం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

4) కొంచెం వాముని మెత్తగా దంచి, దానిని గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకొంటే ఊపిరితిత్తులలో కఫం తగ్గి శ్వాస బాగా ఆడుతుంది.

5) గర్భం దాల్చిన స్త్రీలలో ఉండే సాధారణ సమస్యలైన మలబద్దకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు వాము నీరు చక్కటి మందులా ఉపయోగపడుతుంది.

6) ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున వాము నీరు తాగితే పొట్ట తగ్గుతుంది, లావు తగ్గుతారు.

7) వాము ని కొద్దిగా దంచి, పొడిని వేయించి దానికి కొద్దిగా బెల్లం కలిపి ప్రతిరోజు ఆ మిశ్రమాన్ని తింటే కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

8) 


No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates