LATEST UPDATES

Tuesday 22 March 2022

ఉదయాన్నే బాదం తింటే?

బాదం పప్పును పొట్టు తోనే తింటున్నారా?, ఉదయాన్నే బాదం తింటే?, బాదం పప్పు
బాదం పప్పును పొట్టు తోనే తింటున్నారా?, ఉదయాన్నే బాదం తింటే?, బాదం పప్పు


రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది.

తెల్ల రక్తకణాల సామర్థ్యం పెరిగి ఇన్ఫెక్షన్లు బారినపడే అవకాశాలు తక్కువ ఉంటాయి.

బాదంలో ఉండే విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును నియంత్రిస్తాయి.

దీర్ఘకాలంగా ఉండే మలబద్దకం సమస్య తీరుతుంది.

రక్త ప్రసారం సవ్యంగా జరిగి గుండె జబ్బులు రావు.

బాదంపప్పులోని విటమిన్‌ B7, ఫోలిక్ ఆమ్లం క్యాన్సర్‌తో పోరాడుతాయి.

ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది.

బాదం పప్పును పొట్టు తోనే తింటున్నారా?

          బాదం పప్పును పొట్టును తొలగించి తినటమే ఉత్తమం. బాదాం పొట్టులో టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాల శోషణలో అడ్డుపడతాయి. బాదం పప్పును నానబెట్టి తినటమే మంచిది, నానబెట్టటం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించే లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది, ఫలితంగా పోషకాల శోషణ మెరుగ్గా జరుగుతుంది. అధిక బరువు తగ్గాలనుకొంటే బాదం పప్పును నానబెట్టి, పొట్టును తొలగించి తినాలి.








బాదం పప్పును పొట్టు తోనే తింటున్నారా?

 

బాదం పప్పు

          బాదం పప్పును పొట్టును తొలగించి తినటమే ఉత్తమం. బాదాం పొట్టులో టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాల శోషణలో అడ్డుపడతాయి. బాదం పప్పును నానబెట్టి తినటమే మంచిది, నానబెట్టటం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించే లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది, ఫలితంగా పోషకాల శోషణ మెరుగ్గా జరుగుతుంది. అధిక బరువు తగ్గాలనుకొంటే బాదం పప్పును నానబెట్టి, పొట్టు తొలగించి తినాలి.
బాదం పప్పు



Wednesday 16 March 2022

క్లీనింగ్ టిప్స్

గ్యాస్ స్టవ్ బర్నర్లని ఒక గిన్నెలో వేసి రెండు ప్యాకెట్ల ఈనో పొడి, రెండు స్పూన్ల నిమ్మరసం, కొన్ని నీళ్ళు పోసి 15 నిముషాలు నానబెట్టాలి. తర్వాత డిష్ వాషర్ తో రుద్ది కడిగితే మురికంతా తొలగిపోతుంది.

కొన్ని ఆపిల్ తొక్కలను నీళ్ళలో వేసి బాగా మరిగించాలి, ఈ నీటితో అల్యూమినియం పాత్రలను తోమితే మొండి మరకలు పోతాయి.

సయాటికా నొప్పికి ఆయుర్వేద చిట్కాలు


3 స్పూన్ల ఆముదపు గింజలు పొట్టు తీసేసి మెత్తగా నూరాలి, గోరువెచ్చని ఆవు పాలలో దాన్ని కలుపుకొని రోజూ తాగాలి.

వెల్లుల్లిని పేస్ట్ లా చేసుకొని, కొబ్బరినూనె, పసుపుతో కలిపి మర్దన చేసుకొంటే నొప్పులు తగ్గుతాయి.

ఒక చెంచా ఆముదాన్ని, 30  మీ. లీ., శొంఠి కషాయంతో కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

వేయించిన జీలకర్రను, పచ్చి జీలకర్రను బాగా నూరి, అందులో కొంచెం చక్కెర కలిపి మూడుపూటలా తీసుకొంటే ప్రయోజనం ఉంటుంది.


వెండి ఆభరణాలు మెరవాలంటే ఇలా చేయండి

సాధారణంగా వెండి ఆభరణాలు కొద్దిరోజులు వాడాక వాటి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది, కొన్ని చిట్కాలతో వాటిని మళ్ళి మెరిసేలా చేసుకోవచ్చు.

వేడి నీటిలో వైట్ వెనిగర్ వేసి దానికి ఉప్పు కలపాలి, అందులో వెండి వస్తువులను అరగంట పాటు ఉంచి తర్వాత టూత్ బ్రష్ తో క్లీన్ చేస్తే నగలు మెరుస్తాయి.

వేడి నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి అందులో వెండి వస్తువులను అరగంట పాటు ఉంచాలి తర్వాత టూత్ బ్రష్ లేదా ఫాయిల్ పేపర్ తో క్లీన్ చేస్తే నగలకు  మంచి మెరుపు వస్తుంది.


వీటిని ఫ్రిజ్ లో పెట్టకండి


టమోటాలు ఫ్రిజ్ లో పెడితే వాటిమీది పలుచటి పోర ముడతలు పడిపోతుంది. అందులోని విటమిన్ 'C' తగ్గిపోతుంది. 

పుచ్చకాయలు పెడితే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. తీయగా ఉండాల్సిన కాయ చప్పగా మారిపోతుంది.

పుదీనా పెడితే ఆకులు నల్లగా మారిపోయాయి.

బ్రెడ్ బూజు పట్టే ఛాన్స్ ఉంది.

చల్లటి ఉష్ణోగ్రతలకు పచ్చళ్ళు తొందరగా పాడవుతాయి.


Saturday 12 March 2022

అరికాళ్ళ పగుళ్ళకు చెక్ పెట్టండిలా

అరికాళ్ళ పగుళ్లు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు, అత్యంత సాధారణ కారణం చర్మం పొడిబారడం. ఎక్కువసేపు నిలబడి ఉండటం, తామర, సోరియాసిస్ లేదా అథ్లెట్స్ ఫుట్ వంటి కొన్ని చర్మ పరిస్థితులు మరియు అధిక బరువు వల్ల చర్మం పొడిబారడం జరుగుతుంది.


అరికాళ్ళ పగుళ్ళని నయం చేయడంలో సహాయపడే మార్గాలు:

1. రాత్రి నిద్రపోయేముందు కాలి పగుళ్ళకి కొబ్బరినూనె పూయాలి, పగుళ్లు ఉన్న చోట మర్దన చేయాలి.

2. అలోవెరా జెల్ తో పాదాల పగుళ్ళకు రుద్దాలి, దీనివల్ల పగుళ్లు మాయం అవుతాయి.

3. గోరువెచ్చని నీటిలో కాళ్ళని పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.

4. ఒక టబ్ లో నీళ్ళు పోసి అందులో నిమ్మరసం పిండాలి, పగిలిన కళ్ళను ఆ నీళ్ళలో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి.

పగిలిన మడమలను నివారించే మార్గాలు:

1. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజ్ చేయండి.

2. షవర్ వాటర్ గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి.

3. మీ పాదాలను స్క్రబ్ చేయవద్దు.


@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates