Monday, 11 April 2022
Beauty Tips
పచ్చి ఉల్లిపాయ తో ప్రయోజనాలు
ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తింటే చిగుళ్ల సమస్య తొలగిపోతుంది.
ఉల్లిపాయలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.
ఉల్లిపాయలు ఎముకల బలహీనత రాకుండా నిరోధించే గుణాలున్నాయి.
ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఉల్లిని తినడం వల్ల మొటిమలు చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
Sunday, 10 April 2022
తమలపాకులతో లాభాలు తెలుసా?
భోజనం తర్వాత తమలపాకులు తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.
గాయాలపై తమలపాకు రసం రాస్తే త్వరగా మానిపోతుంది.
కొబ్బరి నూనెలో తమలపాకు రసం కలిపి వెన్నెముక పై రాస్తే వెన్ను నొప్పి తగ్గుతుంది.
చెవి పోటు ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని చెవిలో పిండితే చెవి పోటు తగ్గుతుంది.
అజీర్తి చేసినప్పుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది.
తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
తమలపాకులు నమలడం వలన పంటి నొప్పి నుండి ఉపశమనం కలగటమే కాకుండా దంతక్షయం కూడా నివారించబడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది
స్నేక్ ప్లాంట్ వల్ల ప్రయోజనాలు
ఇంటి లోపల గాలిని ఫిల్టర్ చేస్తుంది.
విషపూరిత కాలుష్యాలను తొలగిస్తుంది.
అలర్జీలకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతుంది.
చిన్న, చిన్న అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కొబ్బరి నీరు -- ఉపయోగాలు
కొబ్బరి నీళ్లని ఉదయమే తాగటం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. దీంతో బద్దకం, నిద్ర వంటివి రావు.
పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి కావల్సినంత పొటాషియం లభిస్తుంది, దీంతో శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ తగ్గుతుంది దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
కొబ్బరి నీళ్లను పరగడుపున తాగితే ఈ సీజన్లో వచ్చే జీర్ణ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
కలబంద యొక్క అద్భుతమైన ఉపయోగాలు
కలబంద అంటే ఏమిటి?
కలబంద ఒక ఔషధ మొక్క మరియు కలబంద మొక్క ఆకుల నుండి కలబంద జెల్ ఉత్పత్తి అవుతుంది. ఆయుర్వేదంలో కలబంద రారాజు. చర్మ సంబంధిత సమస్యలు నయం చేయడానికి మరియు చర్మం మృదువుగా చేయడానికి ప్రజలు దీనిని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మొక్క నుండి నేరుగా జెల్ తీసి వాడటం సురక్షితం. కలబంద యొక్క ప్రయోజనాలపై ఆధునిక పరిశోధన మిశ్రమంగా ఉంది, కొన్ని ఆధారాలతో ఇది ప్రయోగశాలలో జంతువులలో క్యాన్సర్‌కు కారణమవుతుందని చూపిస్తుంది.
కలబంద మొక్క యొక్క కొన్ని రకాలను మాత్రమే తీసుకోవడం సురక్షితం. మీకు ఇష్టమైన, ఇంటిలో పెంచుకొనే ఈ మొక్కను వడదెబ్బ ఉపశమనం మరియు ఇంటి అలంకరణ కంటే ఎక్కువగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? కలబందను ఎలా ఉపయోగించాలో మరియు సంభావ్య ప్రయోజనాలు మరియు నష్టాలను ఈ క్రింది పోస్ట్ లో తెలుసుకుందాం.
కలబంద ఉపయోగాలు
1. కలబంద గుజ్జు చర్మం పై తేమను ఆరిపోనివ్వదు.
2. కాలిన గాయాలను నయం చేస్తుంది
దీని తేమ మరియు శీతలీకరణ లక్షణాల కారణంగా, కలబందను కాలిన గాయాలకు చికిత్స చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. మీకు వడదెబ్బ లేదా తేలికపాటి కాలిన గాయాలు ఉంటే, కలబందను రోజుకు కొన్ని సార్లు ఆ ప్రాంతానికి రాయండి. (తేలికపాటి కాలిన గాయాలకు మాత్రమే).
3. జీర్ణక్రియ ని మెరుగుపరుస్తుంది
కలబందను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది మరియు Irritable Bowel Syndrome (ఐబిఎస్) తో సహా కడుపు వ్యాధులను ఉపశమనం చేస్తుంది మరియు నయం చేస్తుంది.
4. మొటిమలను క్లియర్ చేస్తుంది
మీ ముఖం మీద తాజా కలబందను ఉపయోగించడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. అలోవెరా మరియు బియ్యపు పిండి పేస్ట్‌ను ఫేస్ ప్యాక్‌గా ప్రయత్నించండి మరియు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.
5. కలబంద గుజ్జు త్వరగా జుట్టు పెరిగేలా చేస్తుంది.
6. యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుని నివారిస్తాయి.
7. కలబంద అద్భుతమైన కండిషనర్గా పనిచేస్తుంది.
చర్మ సౌందర్యం కోసం
1) కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసి 10 నిముషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే, ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి కాంతివంతంగా తయారుఅవుతుంది.
2) కలబంద గుజ్జు, పెరుగు, రోజ్ వాటర్ కలిపి ముఖంపై పూయాలి. ఇలా చేస్తే చర్మంపై ర్యాషెస్, మురికి వదిలి ముఖం మృదువుగా తయారుఅవుతుంది.
3) శరీరం కాలిన చోట కలబంద గుజ్జును రాస్తే మచ్చలు తొలగిపోతాయి.
మొటిమలు తగ్గేదెలా?
1) టమోటారసం & ముల్తానీ మట్టి
రెండు చెంచాల టమోటారసం, ఒక చెంచా ముల్తానీ మట్టి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై పట్టించుకోవాలి. 15 నిముషాల పాటు ఆరబెట్టి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి, ముఖం కూడా కాంతివంతంగా తయారుఅవుతుంది.
2) కలబంద
మీ ముఖం మీద తాజా కలబందను ఉపయోగించడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. అలోవెరా మరియు బియ్యపు పిండి పేస్ట్‌ను ఫేస్ ప్యాక్‌గా ప్రయత్నించండి మరియు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.