LATEST UPDATES

Wednesday 16 March 2022

సయాటికా నొప్పికి ఆయుర్వేద చిట్కాలు


3 స్పూన్ల ఆముదపు గింజలు పొట్టు తీసేసి మెత్తగా నూరాలి, గోరువెచ్చని ఆవు పాలలో దాన్ని కలుపుకొని రోజూ తాగాలి.

వెల్లుల్లిని పేస్ట్ లా చేసుకొని, కొబ్బరినూనె, పసుపుతో కలిపి మర్దన చేసుకొంటే నొప్పులు తగ్గుతాయి.

ఒక చెంచా ఆముదాన్ని, 30  మీ. లీ., శొంఠి కషాయంతో కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

వేయించిన జీలకర్రను, పచ్చి జీలకర్రను బాగా నూరి, అందులో కొంచెం చక్కెర కలిపి మూడుపూటలా తీసుకొంటే ప్రయోజనం ఉంటుంది.


వెండి ఆభరణాలు మెరవాలంటే ఇలా చేయండి

సాధారణంగా వెండి ఆభరణాలు కొద్దిరోజులు వాడాక వాటి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది, కొన్ని చిట్కాలతో వాటిని మళ్ళి మెరిసేలా చేసుకోవచ్చు.

వేడి నీటిలో వైట్ వెనిగర్ వేసి దానికి ఉప్పు కలపాలి, అందులో వెండి వస్తువులను అరగంట పాటు ఉంచి తర్వాత టూత్ బ్రష్ తో క్లీన్ చేస్తే నగలు మెరుస్తాయి.

వేడి నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి అందులో వెండి వస్తువులను అరగంట పాటు ఉంచాలి తర్వాత టూత్ బ్రష్ లేదా ఫాయిల్ పేపర్ తో క్లీన్ చేస్తే నగలకు  మంచి మెరుపు వస్తుంది.


వీటిని ఫ్రిజ్ లో పెట్టకండి


టమోటాలు ఫ్రిజ్ లో పెడితే వాటిమీది పలుచటి పోర ముడతలు పడిపోతుంది. అందులోని విటమిన్ 'C' తగ్గిపోతుంది. 

పుచ్చకాయలు పెడితే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. తీయగా ఉండాల్సిన కాయ చప్పగా మారిపోతుంది.

పుదీనా పెడితే ఆకులు నల్లగా మారిపోయాయి.

బ్రెడ్ బూజు పట్టే ఛాన్స్ ఉంది.

చల్లటి ఉష్ణోగ్రతలకు పచ్చళ్ళు తొందరగా పాడవుతాయి.


Saturday 12 March 2022

అరికాళ్ళ పగుళ్ళకు చెక్ పెట్టండిలా

అరికాళ్ళ పగుళ్లు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు, అత్యంత సాధారణ కారణం చర్మం పొడిబారడం. ఎక్కువసేపు నిలబడి ఉండటం, తామర, సోరియాసిస్ లేదా అథ్లెట్స్ ఫుట్ వంటి కొన్ని చర్మ పరిస్థితులు మరియు అధిక బరువు వల్ల చర్మం పొడిబారడం జరుగుతుంది.


అరికాళ్ళ పగుళ్ళని నయం చేయడంలో సహాయపడే మార్గాలు:

1. రాత్రి నిద్రపోయేముందు కాలి పగుళ్ళకి కొబ్బరినూనె పూయాలి, పగుళ్లు ఉన్న చోట మర్దన చేయాలి.

2. అలోవెరా జెల్ తో పాదాల పగుళ్ళకు రుద్దాలి, దీనివల్ల పగుళ్లు మాయం అవుతాయి.

3. గోరువెచ్చని నీటిలో కాళ్ళని పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.

4. ఒక టబ్ లో నీళ్ళు పోసి అందులో నిమ్మరసం పిండాలి, పగిలిన కళ్ళను ఆ నీళ్ళలో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి.

పగిలిన మడమలను నివారించే మార్గాలు:

1. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజ్ చేయండి.

2. షవర్ వాటర్ గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి.

3. మీ పాదాలను స్క్రబ్ చేయవద్దు.


Sunday 27 February 2022

సింపుల్ వంటింటి చిట్కాలు

--> ఆలుగడ్డలు చల్లని నీటిలో వేస్తే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది.

--> అరటిపండ్లు కవర్ లో ఉంచకండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయట తీసి విడివిడిగా పెట్టండి.

--> పేపర్లో చుట్టి పెడితే ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

--> కోడిగుడ్లను ఉడికించిన తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపితే పెంకులన్ని సులువుగా  పగులుతాయి.

--> ఆపిల్ పండు ముక్కలు కొస్తే కొద్దిసేపటికి రంగు మారతాయి. దీంతో తినాలమీపించాడు. అలాకాకుండా ఆపిల్ ముక్కలపై నిమ్మరసం పిండితే చాలా సేపటి వరకు తాజాగా, రంగు మారకుండా ఉంటాయి. తినేటప్పుడు కడుక్కొని తింటే పులుపు తగలదు.

--> కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు.

--> అగరుబత్తి నుసితో ఇత్తడి పాత్రలు కడగటం వాళ్ళ బాగా శుభ్రపడుతాయి.

--> కత్తిపీటకు ఉప్పు రాయటం వల్ల పదునుగా తయారవుతుంది.

--> మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్ళలో ఇనుప వస్తువు ఏదైనా చేయాలి.

--> బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.

నోటిపూత తగ్గడానికి చిట్కాలు

నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) సాధారణంగా అందరికీ వస్తుంటాయి. నాలుకతో పాటు పెదవుల లోపలి భాగంలో పొక్కులు కనిపిస్తాయి. దీంతో  కొంచెం కారం తగిలినా తట్టుకోలేరు. నోటి పుండ్లు ఎలాంటి హాని కలిగించవు, అయితే డాక్టర్ అవసరం లేకుండా ఇంట్లో చిట్కాలతో తగ్గించుకోవచ్చు.


తేనే, పసుపు కలిపి పూతపై రాయటం వల్ల తొందరగా ఉపశమనం లభిస్తుంది (నోటిపూత తగ్గుతుంది.) 

కొబ్బరి నూనె అప్లై చేయటం లేదా పచ్చికొబ్బరి నమలడం.

నోటిపూత ఉన్నచోట నెయ్యి రాయటం.

ప్రతిరోజూ రెండు మూడు సార్లు మజ్జిగ తాగటం.

రోజుకు నాలుగైదు సార్లు తులసి ఆకులు నమలడం వల్ల తులసి ఆకుల నుంచి వచ్చే రసం నోటి పుండ్లు త్వరగా నయం అయ్యేలా చేస్తుంది.

పటిక బెల్లం 8 గ్రాములు, కర్పూరం 1 గ్రాము తీసుకుని మెత్తగా నూరి నోటిపై పుండ్లు ఉన్న చోట రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

ఒక చెంచా గసగసాలు పొడిచేసి, దానానికి ఒక చెంచా చక్కెరను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవాలి, ఇలా చేయటం వల్ల ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య తగ్గుతుంది.


గమనిక: ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు అధ్యయనాల ద్వారా అందించబడ్డాయి. ఈ వ్యాసం మీ అవగాహన కోసమే. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమ మార్గం. గమనించగలరు.

పుదీనా ఆకులతో ఆరోగ్యం

 



పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు దూరమౌతాయి. దగ్గు కు చెక్ పెడుతుంది. 

పుదీనా వాసన మెదడును ఉత్తేజపరుస్తుంది, చురుగ్గా పని చేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి ఉపయోగ పడుతుంది. డిప్రెషన్ ని మాయం చేస్తుంది. 

తలకు పుదీనా రాస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. తల చల్లగా ఉంటుంది.

అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

పుదీనాలోని పాలిఫినాల్స్ కడుపులోని గ్యాస్ ని తగ్గిస్తాయి.

చలికాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుండి నివారణ లభిస్తుంది.

పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం, ఫాస్పరస్ లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పుదీనా తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

పుదీనా ఎంజైమ్ లను ప్రేరేపించి జీర్ణవ్యవస్తను ఉత్తేజపరుస్తుంది. మలబద్దకాన్ని దరి చేరనీయదు.

పుదీనా తింటే నోటి దుర్వాసన పోగొడుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలకు పుదీనా తో చెక్ పెట్టొచ్చు.

పుదీనా తో జుట్టు సమస్యల పరిష్కారం

పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకొంటే జుట్టు రాలటం క్రమంగా తగ్గుతుంది. 

పుదీనా నూనెతో  చుండ్రు తొలగి జుట్టు బలంగా తయారుఅవుతుంది, పుదీనా నూనె జుట్టు చివర్లకు రాసుకొంటే చివర్లు చిట్లకుండా ఉంటాయి.

పుదీనా నూనె జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తుంది.



@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates