LATEST UPDATES

Thursday 7 April 2022

ఎసిడిటీకి చెక్ పెట్టే చిట్కాలు


ఎసిడిటీ మొదలైనప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగటం వల్ల ఫలితం ఉంటుంది.

నీళ్లలో పుదీనా ఆకులు వేసి, మరిగించి తేనె కలిపి తాగాలి.

నీళ్లలో స్పూను జీలకర్ర వేసి  మరిగించి తాగాలి.

ఎసిడిటీ మొదలవగానే నోట్లో లవంగాలు వేసుకొని, నములుతూ రసం మింగుతూ ఉండాలి, అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.  ఇలా చేస్తే ఎసిడిటి సమస్య తగ్గుతుంది.

దానిమ్మ, అరటిపళ్ళు, ఆప్రికాట్స్, కొబ్బరి ఎసిడిటీ కి విరుగుడుగా పని చేస్తాయి.


నారింజ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits with orange

 నారింజ పండ్లలో లభించే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది.

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

నారింజపండ్లు రోజూ తీసుకొంటే మంచి నిద్ర వస్తుంది.

నారింజలో 'సీ' విటమిన్ ఉంటుంది, ఇది వాపు తగ్గించటంలో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

నారింజలో లభించే పొటాషియం మెదడుకు మంచిది.

డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది.





Wednesday 6 April 2022

పుచ్చకాయతో ప్రయోజనాలు


వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.

పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినోయాసిడ్  వలన రక్తపోటును తగ్గిస్తుంది.

విరేచనాలు (అతిసారం), కడుపునొప్పి, అసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది.

కాల్షియమ్ అధికంగా ఉన్న పుచ్చకాయతో కీళ్లనొప్పులు, రుమాటిజం, వాతం వంటి రోగాలు నయమవుతాయి.

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, మలబద్దకంతో బాధపడే వారికి ఎంతో మంచిది.

పుచ్చకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు (లైకోపీన్) ఉన్నాయని పరిశోధనలో తేలింది.

పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల, పుచ్చకాయ విత్తనాలు పడేయకుండా తినటం వల్ల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు తరచుగా తీసుకోవడం వల్ల కంటిశుక్లం కూడా తగ్గుతుంది.

Saturday 2 April 2022

బాదంపాలతో ఆరోగ్య ప్రయోజనాలు


బాదంపాలలో మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

రోజూ బాదంపాలు తాగే వాళ్ళలో కండరాలు, ఎముకలు ధృడంగా ఉంటాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పాలలో హెల్త్య్ఫ్యాట్స ఎక్కువగా ఉండటంతో పాటు సోడియం తక్కువగా ఉంటుంది.

షుగర్ కలపని బాదంపాలు రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడతాయి.

Thursday 31 March 2022

వాము ఉపయోగాలు

వాము అన్నది మన వంటయింటిలో ఉండే సాదారణ మసాలా దినుసు, కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాముని అజ్వైన్ (AJWAIN) అని కూడా పిలుస్తారు. ఇంట్లో ఉండే వాముతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను దూరం  చేసుకోవచ్చని ఎంతోమంది నిపుణులు తెలియచేస్తున్నారు.

1) వాము తినడం వల్ల నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

2) వాము తినడం వల్ల (లేదా) వాము నీటిని తాగటం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది, వాములో ఉండే నియాసిన్ గుండె సంభందిత వ్యాధులని నివారిస్తుంది.

3) మైగ్రేన్ తలనొప్పికి చక్కటి మందులా వాము పనిచేస్తుంది, వాము పొడిని సన్నటి గుడ్డలో కట్టి, తరచూ వాసన పీల్చాలి, ఇలా చేయటం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

4) కొంచెం వాముని మెత్తగా దంచి, దానిని గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకొంటే ఊపిరితిత్తులలో కఫం తగ్గి శ్వాస బాగా ఆడుతుంది.

5) గర్భం దాల్చిన స్త్రీలలో ఉండే సాధారణ సమస్యలైన మలబద్దకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు వాము నీరు చక్కటి మందులా ఉపయోగపడుతుంది.

6) ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున వాము నీరు తాగితే పొట్ట తగ్గుతుంది, లావు తగ్గుతారు.

7) వాము ని కొద్దిగా దంచి, పొడిని వేయించి దానికి కొద్దిగా బెల్లం కలిపి ప్రతిరోజు ఆ మిశ్రమాన్ని తింటే కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

8) 


మజ్జిగ (Buttermilk) తాగటం వల్ల ఉపయోగాలు


మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం,



మజ్జిగ (Buttermilk) దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే సోడియం, కాల్షియం ను అందిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అధిక బరువుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

పైల్స్ తో బాధపడేవారికి మజ్జిగ తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పొట్టఉబ్బరం తగ్గటం కోసం మజ్జిగలో కొంచెం జీలకర్ర, ఇంగువ, సైంధవ లవణాన్ని కలిపి తీసుకోవాలి. 

మజ్జిగ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, మజ్జిగ తాగటం వల్ల నీరసం, అలసట దూరమవుతాయి.

మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉండటం వల్ల శరీరంలో క్రోవ్వు పెరగకుండా నిరోధిస్తుంది.


Monday 28 March 2022

ఇంగువ వల్ల ఉపయోగాలు

1) జీర్ణ క్రియని మెరుగుపరుస్తుంది, మలబద్దకం, కడుపులో తిమ్మిరి, గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది. 

2) శరీరంలో హానికారక బాక్టీరియాను నిరోధించే యాంటీ మైక్రో బయాల్ గా పని చేస్తుంది. 

3) పచ్చళ్ళు వంటి నిలువ పదార్థాలలో ఉపయోగించడం వల్ల అవి జిడ్డు వాసన రాకుండా, పాడవకుండా ఉంటాయి. 

4) కాలేయంలో హానికారక విష పదార్థాల యొక్క మోతాదును తగ్గించడం లో తోడ్పడుతుంది.

5) హార్ట్ ఎటాక్ మరియు కరోనరీ వంటి గుండె సంబంధ సమస్యలు రాకుండాఆ ఉపయోగపడుతుంది.

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates