LATEST UPDATES

Friday 8 April 2022

దాల్చిన చెక్క తో ఆరోగ్య ప్రయోజనాలు

దాల్చిన చెక్క వంటలలో వాడే ఒక పదార్థంలానే కాకుండా ఔషధంలా కూడా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.

1) దాల్చిన చెక్క గుండె జబ్బులను నియంత్రిస్తుంది. 

2) కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది, గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3) డయాబెటిస్ ను తగ్గిస్తుంది.

4) దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి.

5) దాల్చినచెక్కను ఆహారంలో వాడటం వల్ల కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక దాల్చిన చెక్క నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. 

6) మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7) చిగుర్ల వాపును, దంత సమస్యలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క నోటి దుర్వాసన నివారిస్తుంది.

8) దాల్చిన చెక్క టీ తాగటం వలన బరువు తగ్గుతారు. ఇందులోని "సిన్నమాల్డిహైడ్" అనే పదార్థం కొవ్వును తగ్గిస్తుంది.

9) ఆకలిని మెరుగుపరుస్తుంది.




Thursday 7 April 2022

దానిమ్మ పండ్ల తో ప్రయోజనాలు

ఒక కప్పు దానిమ్మ పండు విత్తనాలలో  30% విటమిన్ C, 36% విటమిన్ K , 16% విటమిన్ B మరియు పొటాషియం ఉంటాయి.

దానిమ్మ పండ్లు శరీరంలోని క్రోవ్వు  తగ్గిస్తాయి.

రక్తప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడుతాయి.

దానిమ్మ పండ్లు సహజ ఇన్సులిన్ (Insulin) గా పనిచేస్తాయి.

క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి.

అరుగుదల బాగా జరుగుతుంది. 




ఎసిడిటీకి చెక్ పెట్టే చిట్కాలు


ఎసిడిటీ మొదలైనప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగటం వల్ల ఫలితం ఉంటుంది.

నీళ్లలో పుదీనా ఆకులు వేసి, మరిగించి తేనె కలిపి తాగాలి.

నీళ్లలో స్పూను జీలకర్ర వేసి  మరిగించి తాగాలి.

ఎసిడిటీ మొదలవగానే నోట్లో లవంగాలు వేసుకొని, నములుతూ రసం మింగుతూ ఉండాలి, అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.  ఇలా చేస్తే ఎసిడిటి సమస్య తగ్గుతుంది.

దానిమ్మ, అరటిపళ్ళు, ఆప్రికాట్స్, కొబ్బరి ఎసిడిటీ కి విరుగుడుగా పని చేస్తాయి.


నారింజ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits with orange

 నారింజ పండ్లలో లభించే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది.

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

నారింజపండ్లు రోజూ తీసుకొంటే మంచి నిద్ర వస్తుంది.

నారింజలో 'సీ' విటమిన్ ఉంటుంది, ఇది వాపు తగ్గించటంలో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

నారింజలో లభించే పొటాషియం మెదడుకు మంచిది.

డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది.





Wednesday 6 April 2022

పుచ్చకాయతో ప్రయోజనాలు


వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.

పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినోయాసిడ్  వలన రక్తపోటును తగ్గిస్తుంది.

విరేచనాలు (అతిసారం), కడుపునొప్పి, అసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది.

కాల్షియమ్ అధికంగా ఉన్న పుచ్చకాయతో కీళ్లనొప్పులు, రుమాటిజం, వాతం వంటి రోగాలు నయమవుతాయి.

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, మలబద్దకంతో బాధపడే వారికి ఎంతో మంచిది.

పుచ్చకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు (లైకోపీన్) ఉన్నాయని పరిశోధనలో తేలింది.

పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల, పుచ్చకాయ విత్తనాలు పడేయకుండా తినటం వల్ల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు తరచుగా తీసుకోవడం వల్ల కంటిశుక్లం కూడా తగ్గుతుంది.

Saturday 2 April 2022

బాదంపాలతో ఆరోగ్య ప్రయోజనాలు


బాదంపాలలో మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

రోజూ బాదంపాలు తాగే వాళ్ళలో కండరాలు, ఎముకలు ధృడంగా ఉంటాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పాలలో హెల్త్య్ఫ్యాట్స ఎక్కువగా ఉండటంతో పాటు సోడియం తక్కువగా ఉంటుంది.

షుగర్ కలపని బాదంపాలు రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడతాయి.

Thursday 31 March 2022

వాము ఉపయోగాలు

వాము అన్నది మన వంటయింటిలో ఉండే సాదారణ మసాలా దినుసు, కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాముని అజ్వైన్ (AJWAIN) అని కూడా పిలుస్తారు. ఇంట్లో ఉండే వాముతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను దూరం  చేసుకోవచ్చని ఎంతోమంది నిపుణులు తెలియచేస్తున్నారు.

1) వాము తినడం వల్ల నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

2) వాము తినడం వల్ల (లేదా) వాము నీటిని తాగటం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది, వాములో ఉండే నియాసిన్ గుండె సంభందిత వ్యాధులని నివారిస్తుంది.

3) మైగ్రేన్ తలనొప్పికి చక్కటి మందులా వాము పనిచేస్తుంది, వాము పొడిని సన్నటి గుడ్డలో కట్టి, తరచూ వాసన పీల్చాలి, ఇలా చేయటం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

4) కొంచెం వాముని మెత్తగా దంచి, దానిని గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకొంటే ఊపిరితిత్తులలో కఫం తగ్గి శ్వాస బాగా ఆడుతుంది.

5) గర్భం దాల్చిన స్త్రీలలో ఉండే సాధారణ సమస్యలైన మలబద్దకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు వాము నీరు చక్కటి మందులా ఉపయోగపడుతుంది.

6) ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున వాము నీరు తాగితే పొట్ట తగ్గుతుంది, లావు తగ్గుతారు.

7) వాము ని కొద్దిగా దంచి, పొడిని వేయించి దానికి కొద్దిగా బెల్లం కలిపి ప్రతిరోజు ఆ మిశ్రమాన్ని తింటే కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

8) 


@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates