LATEST UPDATES

Sunday 10 April 2022

కొబ్బరి నీరు -- ఉపయోగాలు

కొబ్బరి నీళ్లని ఉదయమే తాగటం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. దీంతో బద్దకం, నిద్ర వంటివి రావు. 

పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి కావల్సినంత పొటాషియం లభిస్తుంది, దీంతో శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ తగ్గుతుంది దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

కొబ్బరి నీళ్లను పరగడుపున తాగితే ఈ సీజన్లో వచ్చే జీర్ణ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.



కలబంద యొక్క అద్భుతమైన ఉపయోగాలు


కలబంద అంటే ఏమిటి?

          కలబంద ఒక ఔషధ మొక్క మరియు కలబంద మొక్క ఆకుల నుండి కలబంద జెల్ ఉత్పత్తి అవుతుంది. ఆయుర్వేదంలో కలబంద రారాజు.  చర్మ సంబంధిత సమస్యలు నయం చేయడానికి మరియు చర్మం మృదువుగా చేయడానికి ప్రజలు దీనిని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మొక్క నుండి నేరుగా జెల్ తీసి వాడటం సురక్షితం. కలబంద యొక్క ప్రయోజనాలపై ఆధునిక పరిశోధన మిశ్రమంగా ఉంది, కొన్ని ఆధారాలతో ఇది ప్రయోగశాలలో జంతువులలో క్యాన్సర్‌కు కారణమవుతుందని చూపిస్తుంది. 

          కలబంద మొక్క యొక్క కొన్ని రకాలను మాత్రమే తీసుకోవడం సురక్షితం. మీకు ఇష్టమైన,  ఇంటిలో పెంచుకొనే ఈ మొక్కను వడదెబ్బ ఉపశమనం మరియు ఇంటి అలంకరణ కంటే ఎక్కువగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? కలబందను ఎలా ఉపయోగించాలో మరియు సంభావ్య ప్రయోజనాలు మరియు నష్టాలను ఈ క్రింది పోస్ట్ లో తెలుసుకుందాం.


కలబంద ఉపయోగాలు

1. కలబంద గుజ్జు చర్మం పై తేమను ఆరిపోనివ్వదు. 

2. కాలిన గాయాలను నయం చేస్తుంది

దీని తేమ మరియు శీతలీకరణ లక్షణాల కారణంగా, కలబందను కాలిన గాయాలకు చికిత్స చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. మీకు వడదెబ్బ లేదా తేలికపాటి కాలిన గాయాలు ఉంటే, కలబందను రోజుకు కొన్ని సార్లు ఆ ప్రాంతానికి రాయండి. (తేలికపాటి కాలిన గాయాలకు మాత్రమే).

3. జీర్ణక్రియ ని  మెరుగుపరుస్తుంది

కలబందను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది మరియు Irritable Bowel Syndrome (ఐబిఎస్) తో సహా కడుపు వ్యాధులను ఉపశమనం చేస్తుంది మరియు నయం చేస్తుంది.

4. మొటిమలను క్లియర్ చేస్తుంది

మీ ముఖం మీద తాజా కలబందను ఉపయోగించడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. అలోవెరా మరియు బియ్యపు పిండి పేస్ట్‌ను ఫేస్ ప్యాక్‌గా ప్రయత్నించండి మరియు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.

5. కలబంద గుజ్జు  త్వరగా జుట్టు పెరిగేలా చేస్తుంది.

6. యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుని నివారిస్తాయి.

7. కలబంద అద్భుతమైన కండిషనర్గా పనిచేస్తుంది.

చర్మ సౌందర్యం కోసం

1) కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసి 10 నిముషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే, ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి కాంతివంతంగా తయారుఅవుతుంది.

2) కలబంద గుజ్జు, పెరుగు, రోజ్ వాటర్ కలిపి ముఖంపై పూయాలి. ఇలా చేస్తే చర్మంపై ర్యాషెస్, మురికి వదిలి ముఖం మృదువుగా తయారుఅవుతుంది.

3) శరీరం కాలిన చోట కలబంద గుజ్జును రాస్తే మచ్చలు తొలగిపోతాయి. 

మొటిమలు తగ్గేదెలా?


1) టమోటారసం & ముల్తానీ మట్టి

రెండు చెంచాల టమోటారసం, ఒక చెంచా ముల్తానీ మట్టి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై పట్టించుకోవాలి. 15 నిముషాల పాటు ఆరబెట్టి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి, ముఖం కూడా కాంతివంతంగా తయారుఅవుతుంది.

2) కలబంద

మీ ముఖం మీద తాజా కలబందను ఉపయోగించడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. అలోవెరా మరియు బియ్యపు పిండి పేస్ట్‌ను ఫేస్ ప్యాక్‌గా ప్రయత్నించండి మరియు మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.



Friday 8 April 2022

వేసవిలో జుట్టు దుర్వాసనకు చెక్ పెట్టండిలా

SMOOTH, SILKY, SHINY HAIR

1) వేసవిలో వెంట్రుకలనుండి వచ్చే చెమట వాసనకు పోగొట్టాలంటే కప్పు నీటిలో రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి జుట్టును కడుక్కోవాలి.

2) స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో రెండు మూతల రోజ్ వాటర్ వేసి దానితో జుట్టు కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సువాసనతో పాటు జిగట దూరం అవుతుంది.

3) కలబంద జెల్ తో వారానికి రెండు సార్లు జుట్టును కడుక్కోవటం వల్ల జుట్టు మెరుస్తుంది.


దాల్చిన చెక్క తో ఆరోగ్య ప్రయోజనాలు

దాల్చిన చెక్క వంటలలో వాడే ఒక పదార్థంలానే కాకుండా ఔషధంలా కూడా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.

1) దాల్చిన చెక్క గుండె జబ్బులను నియంత్రిస్తుంది. 

2) కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది, గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3) డయాబెటిస్ ను తగ్గిస్తుంది.

4) దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి.

5) దాల్చినచెక్కను ఆహారంలో వాడటం వల్ల కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక దాల్చిన చెక్క నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. 

6) మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7) చిగుర్ల వాపును, దంత సమస్యలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క నోటి దుర్వాసన నివారిస్తుంది.

8) దాల్చిన చెక్క టీ తాగటం వలన బరువు తగ్గుతారు. ఇందులోని "సిన్నమాల్డిహైడ్" అనే పదార్థం కొవ్వును తగ్గిస్తుంది.

9) ఆకలిని మెరుగుపరుస్తుంది.




Thursday 7 April 2022

దానిమ్మ పండ్ల తో ప్రయోజనాలు

ఒక కప్పు దానిమ్మ పండు విత్తనాలలో  30% విటమిన్ C, 36% విటమిన్ K , 16% విటమిన్ B మరియు పొటాషియం ఉంటాయి.

దానిమ్మ పండ్లు శరీరంలోని క్రోవ్వు  తగ్గిస్తాయి.

రక్తప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడుతాయి.

దానిమ్మ పండ్లు సహజ ఇన్సులిన్ (Insulin) గా పనిచేస్తాయి.

క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి.

అరుగుదల బాగా జరుగుతుంది. 




ఎసిడిటీకి చెక్ పెట్టే చిట్కాలు


ఎసిడిటీ మొదలైనప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగటం వల్ల ఫలితం ఉంటుంది.

నీళ్లలో పుదీనా ఆకులు వేసి, మరిగించి తేనె కలిపి తాగాలి.

నీళ్లలో స్పూను జీలకర్ర వేసి  మరిగించి తాగాలి.

ఎసిడిటీ మొదలవగానే నోట్లో లవంగాలు వేసుకొని, నములుతూ రసం మింగుతూ ఉండాలి, అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.  ఇలా చేస్తే ఎసిడిటి సమస్య తగ్గుతుంది.

దానిమ్మ, అరటిపళ్ళు, ఆప్రికాట్స్, కొబ్బరి ఎసిడిటీ కి విరుగుడుగా పని చేస్తాయి.


@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates