LATEST UPDATES

Thursday, 14 April 2022

పులిపిర్లతో బాధపడుతున్నారా?

          పులిపిర్లు అనేది సాధారణ చర్మ సమస్య, హెచ్ పి బి అనే వైరస్ కారణంగా మన చర్మం ఫై పులిపిర్లు ఏర్పడుతాయి. పులిపిర్ల వల్ల మనకు ఎటువంటి నొప్పి ఉండదు. వీటిని తొలగించుకోటానికి కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం,

బొప్పాయి పాలను పులిపిర్లపై రాస్తే అవి ఊడిపోతాయి.

సున్నం, బెల్లం కలిపి అవి ఉన్న చోట పెడితే ఫలితం ఉంటుంది.

రెడ్డివారి నానుబాలు చెట్టుకొమ్మలను తెంపితే వచ్చే పాలను పులిపిర్ల మీద రాయాలి, ఇలా నాలుగు లేదా ఐదు సార్లు రాస్తే పులిపిర్లు ఇట్టే రాలిపోతాయి.

అరటిపండు తొక్కకు ఉండే నారవంటి పదార్ధం పులిపిర్ల మీద రాసినా తగ్గుముఖం పడుతాయి. 

వెల్లుల్లి రెమ్మలను పులిపిర్లపై రుద్దితే పులిపిర్లు తగ్గుతాయి. 

రావి చెట్టు బెరడును కాల్చగా వచ్చిన బూడిదను సున్నం, వెన్న సమానంగా కలుపుకొని పులిపిర్ల పై రోజు రాస్తూ ఉంటే క్రమంగా రాలిపోతాయి.


Monday, 11 April 2022

పంటి నొప్పిని (TOOTHACHE) తగ్గించే చిట్కాలు


1) కొన్ని పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో 20 నిముషాలు ఉంచి, చల్లబడిన తరువాత వాటితో పుక్కిలించాలి.

2) రోజూ రెండు పూటలా ఉప్పు నీళ్ళలో పుక్కిలిస్తే నోట్లో ఉండే క్రిములు, వ్యర్ధాలు తొలగుతాయి. 

3) నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని (Clove) పెట్టి నెమ్మదిగా నొక్కి కొద్దిసేపు ఉంచితే ప్రయోజనముంటుంది. 3 నుంచి 4 లవంగాలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో రాసినా కూడా ఉపశమనం లభిస్తుంది.

4) అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవటం వళ్ళ తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ నుంచి వచ్చే రసం నొప్పిని తగ్గిస్తుంది.

5) వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు (లేదా) మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.

బరువు తగ్గడానికి జ్యూసులు

          బరువు తగ్గడానికి ఎంతోమంది ఎన్నో పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు (జిమ్ లో వర్క్ అవుట్, డైట్ కంట్రోల్), అయితే ఈరోజు మనం బరువు తగ్గడానికి ఉపయోగపడే జ్యూస్‌ల గురించి తెలుసుకుందాం. 


టమోటా జ్యూస్:

1) కావలసినవి: టమోటాలు 3, బెల్లం

బరువు తగ్గాలనుకునేవారు 3 టమోటాలను బాగా ఉడికించి... మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి మూడు పూటలా తీసుకుంటే బరువు తగ్గుతారు.



లెమన్ జ్యూస్:

1) కావలసినవి: నిమ్మకాయలు 2, ఉప్పు, తేనె

లెమన్ జ్యూస్ లో చిటికెడు ఉప్పు, తేనె కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకున్నట్లయితే.... చెడు కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చు.


అవకాడో జ్యూస్:

1) కావలసినవి: అవకాడో, తేనె

అవకాడోను గ్రైండ్ చేసి తేనె కలుపుకుని తాగితే పొట్టను తగ్గించుకోవచ్చు. ఇందులోని గుడ్ కొలెస్ట్రాల్ శరీరంలోని క్యాలరీల శాతాన్ని బర్న్ చేస్తుంది.






గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి ఇటువంటి చికిత్స/మందులు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్ ను సంప్రదించండి.

Beauty Tips


1) బొంబాయి రవ్వ, పాలు, పసుపు కలిపి ముఖానికి రాసుకొని పది నిముషాల తర్వాత కడిగేస్తే.. చలికాలంలో చర్మం నునుపుగా తయారవుతుంది. 


2) బాగా పండిన బొప్పాయి గుజ్జు అర కప్పు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి.  దీంతో చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్ రావడంతో పాటు పైన పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము, ధూళి వదులుతుంది. 


పచ్చి ఉల్లిపాయ తో ప్రయోజనాలు

ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తింటే చిగుళ్ల సమస్య తొలగిపోతుంది.

ఉల్లిపాయలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.

ఉల్లిపాయలు ఎముకల బలహీనత రాకుండా నిరోధించే గుణాలున్నాయి.

ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఉల్లిని తినడం వల్ల మొటిమలు చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

Sunday, 10 April 2022

తమలపాకులతో లాభాలు తెలుసా?


భోజనం తర్వాత తమలపాకులు తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. 

తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.

గాయాలపై తమలపాకు రసం రాస్తే త్వరగా మానిపోతుంది.

కొబ్బరి నూనెలో తమలపాకు రసం కలిపి వెన్నెముక పై రాస్తే వెన్ను నొప్పి తగ్గుతుంది.

చెవి పోటు ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని చెవిలో పిండితే చెవి పోటు తగ్గుతుంది.

అజీర్తి చేసినప్పుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది.

తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

తమలపాకులు నమలడం వలన పంటి నొప్పి నుండి ఉపశమనం కలగటమే కాకుండా దంతక్షయం కూడా నివారించబడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది

స్నేక్ ప్లాంట్ వల్ల ప్రయోజనాలు


ఇంటి లోపల గాలిని ఫిల్టర్ చేస్తుంది.

విషపూరిత కాలుష్యాలను తొలగిస్తుంది.

అలర్జీలకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతుంది.

చిన్న, చిన్న అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.


@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates