LATEST UPDATES

Tuesday 7 June 2022

జాజి కాయ ప్రయోజనాలు తెలుసా?

జాజికాయ పొడిని సూప్ లో వేసి తీసుకుంటే విరేచనాలు మలబద్ధకం గ్యాస్ జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

జాజికాయ నూనె కీళ్ల నొప్పులు, వాపులకు ఉపశమనం కలిగిస్తుంది.

క్యాల్షియం ఐరన్ మాంగనీస్ పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి.

దంతాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి, నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్ కిడ్నీ ల్లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి.

Saturday 7 May 2022

సోంపు గింజల తో ప్రయోజనాలు

సోంపు గింజలు (fennel seeds)  తింటే జింక్, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి.

రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది.

సోంపు తీసుకోవటం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మంపై వచ్చే దద్దుర్లు రావు.

సోంపు గింజలతో తయారుచేసిన పేస్ట్ ను ముఖంపై రాయటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

బరువు తగ్గదలచినవారికి సోంపు గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి, వీటిని తీసుకోవటం వల్ల జీవక్రియ పెరిగి, క్యాలరీలు త్వరగా కరుగుతాయి. తద్వారా బరువు తగ్గటం ప్రారంభమౌతుంది.

మహిళలకు పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి కలిగినప్పుడు సోంపు నీళ్లను తాగాలి, అప్పుడు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

భోజనం తరువాత సోంపు గింజలను నమలడం వల్ల నోరు శుభ్రంగా ఉండటంతో పాటు తిన్న ఆహారం కూడా జీర్ణం అవుతుంది. భోజనం చేశాక సోంపు తినటం వల్ల ఒంట్లో ఉన్న నీరంతా బయటికి పోతుంది, తద్వారా బరువు తగ్గుతారు.

త్రిదోష (వాత, పిత్త, కఫ ) సమస్యను తగ్గిస్తుంది. 



తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of ICE APPLE

          తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. మూడు తాటిముంజలు తీసుకొంటే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. లేత తాటిముంజల్లో దాదాపు 80 శాతానికి పైగా నీరుంటుంది, కావున వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయిన నీటిని పొందవచ్చు.

వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 

తాటిముంజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, బరువుని అదుపులో ఉంచుకోవాలనేవారికి చక్కటి ఆహారం.

శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటం వల్ల వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఎండవల్ల కలిగే అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి.

అజీర్తి, అసిడిటీ, మలబద్దకం, కడుపులో మంట సమస్యలు దూరం అవుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి.





అంజీర్ వల్ల ప్రయోజనాలు

నానబెట్టిన అంజీర్ గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గిపోతాయి. అంజీర్ పండ్లలో ఎక్కువగా పీచు పదార్ధం లభిస్తుంది.

రక్తహీనతతో బాధపడుతున్నవారు దీన్ని తీసుకొంటే మంచిది.



గాఢ నిద్ర కోసం చిట్కాలు


--> గసగసాలని దోరగా వేయించి పల్చని క్లాత్ లో వేసుకొని నిద్రించేముందు వాసన పీల్చాలి.

--> పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసుకొంటే మంచి నిద్ర పడుతుంది.

-->  గోరువెచ్చని పాలలో మిరియాల పొడి వేసుకుని తాగాలి.






Tuesday 26 April 2022

గ్రే హెయిర్ ను ఇలా నివారించండి

 --> రోజు రాత్రి కొబ్బరి నూనెతో వెంట్రుకలకు మర్దన చేసి ఉదయం తలస్నానం చేయడం వల్ల గ్రేయింగ్ ప్రక్రియను తగ్గించవచ్చు.

--> ఒక టేబుల్ స్పూన్ తేనెతో తాజాగా తురిమిన అల్లం తీసుకోవడం వల్ల తొందరగా వచ్చే తెల్ల వెంట్రుకలు నివారించవచ్చు.

--> వారంలో రెండు మూడు సార్లు నువ్వులు తీసుకోవడం ద్వారా వెంట్రుకలు తెల్లబడే ప్రక్రియే కాస్త తగ్గుతుంది.

--> వారానికి ఒకసారి ఉసిరి నూనె అప్లై చేస్తే వైట్ హెయిర్ పై మంచి ఫలితం కనిపిస్తుంది.



బీరకాయ తో ప్రయోజనాలు


           బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. ఇది విరేచనకారి కూడా. అందువలన పథ్యంగా బీరకాయ చాలామంచిది. లేత బీరపొట్టు వేపుడు జ్వరాన్ని తగ్గిస్తుంది. బీరకాయ మూడు రకాలు పందిరి బీర, పొట్టి బీర, నేతి బీర.

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates