బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. ఇది విరేచనకారి కూడా. అందువలన పథ్యంగా బీరకాయ చాలామంచిది. లేత బీరపొట్టు వేపుడు జ్వరాన్ని తగ్గిస్తుంది. బీరకాయ మూడు రకాలు పందిరి బీర, పొట్టి బీర, నేతి బీర.
Tuesday, 26 April 2022
Tuesday, 19 April 2022
వెల్లుల్లి పాలతో అద్భుత ప్రయోజనాలు
తల్లిపాలు ఇచ్చే అద్భుత ప్రయోజనాలు వెల్లుల్లి పాలతో కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఇందులో నేచురల్ పెయిన్ కిల్లర్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మైగ్రేన్ తలనొప్పి, క్యాన్సర్ తగ్గిస్తుంది.
వెల్లుల్లి పాలను తాగడం వలన సయాటికా, ఆర్థరైటిస్ వంటి జబ్బులకు చెక్ పెట్టవచ్చు. ఎముకలను బలపరచును.
జీర్ణ సంబంధిత వ్యాధులు ఎసిడిటీ గ్యాస్, అజీర్తి , మలబద్దకంను తగ్గిస్తుంది.
దగ్గు, ఆస్తమా, టీబీ,నిమోనియా, మరియు కొలెస్ట్రాల్ తగ్గడానికి మంచి మందు.
కీళ్ల నొప్పులను నివారిస్తుంది.
వయసు పైబడటం తగ్గిస్తుంది.
రక్తంలో ప్లేట్లెట్లు పెంచుతుంది, రక్తం గడ్డకట్టడం ఇవ్వదు.
నేరేడు పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
నేరేడు పండ్లను తీసుకుంటే శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది.
రక్తంలో షుగర్ ను కంట్రోల్ లో ఉంటుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది.
నేరేడు పండ్లను తీసుకునే వారికి దంతాలు, చిగుళ్లు బలంగా ఉంటాయి. చిగుళ్ల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేసే ఏజెంట్ లా పని చేస్తుంది.
మూత్రంలో మంట తగ్గాలంటే నిమ్మరసం, నేరేడు పండు రసాన్ని రెండు చెంచాల నీటిలో కలిపి తీసుకోవాలి.
Thursday, 14 April 2022
పులిపిర్లతో బాధపడుతున్నారా?
పులిపిర్లు అనేది సాధారణ చర్మ సమస్య, హెచ్ పి బి అనే వైరస్ కారణంగా మన చర్మం ఫై పులిపిర్లు ఏర్పడుతాయి. పులిపిర్ల వల్ల మనకు ఎటువంటి నొప్పి ఉండదు. వీటిని తొలగించుకోటానికి కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం,
బొప్పాయి పాలను పులిపిర్లపై రాస్తే అవి ఊడిపోతాయి.
సున్నం, బెల్లం కలిపి అవి ఉన్న చోట పెడితే ఫలితం ఉంటుంది.
రెడ్డివారి నానుబాలు చెట్టుకొమ్మలను తెంపితే వచ్చే పాలను పులిపిర్ల మీద రాయాలి, ఇలా నాలుగు లేదా ఐదు సార్లు రాస్తే పులిపిర్లు ఇట్టే రాలిపోతాయి.
అరటిపండు తొక్కకు ఉండే నారవంటి పదార్ధం పులిపిర్ల మీద రాసినా తగ్గుముఖం పడుతాయి.
వెల్లుల్లి రెమ్మలను పులిపిర్లపై రుద్దితే పులిపిర్లు తగ్గుతాయి.
రావి చెట్టు బెరడును కాల్చగా వచ్చిన బూడిదను సున్నం, వెన్న సమానంగా కలుపుకొని పులిపిర్ల పై రోజు రాస్తూ ఉంటే క్రమంగా రాలిపోతాయి.
Monday, 11 April 2022
పంటి నొప్పిని (TOOTHACHE) తగ్గించే చిట్కాలు
1) కొన్ని పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో 20 నిముషాలు ఉంచి, చల్లబడిన తరువాత వాటితో పుక్కిలించాలి.
2) రోజూ రెండు పూటలా ఉప్పు నీళ్ళలో పుక్కిలిస్తే నోట్లో ఉండే క్రిములు, వ్యర్ధాలు తొలగుతాయి.
3) నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని (Clove) పెట్టి నెమ్మదిగా నొక్కి కొద్దిసేపు ఉంచితే ప్రయోజనముంటుంది. 3 నుంచి 4 లవంగాలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో రాసినా కూడా ఉపశమనం లభిస్తుంది.
4) అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవటం వళ్ళ తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ నుంచి వచ్చే రసం నొప్పిని తగ్గిస్తుంది.
5) వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు (లేదా) మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.
బరువు తగ్గడానికి జ్యూసులు
బరువు తగ్గడానికి ఎంతోమంది ఎన్నో పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు (జిమ్ లో వర్క్ అవుట్, డైట్ కంట్రోల్), అయితే ఈరోజు మనం బరువు తగ్గడానికి ఉపయోగపడే జ్యూస్‌ల గురించి తెలుసుకుందాం.
టమోటా జ్యూస్:
1) కావలసినవి: టమోటాలు 3, బెల్లంబరువు తగ్గాలనుకునేవారు 3 టమోటాలను బాగా ఉడికించి... మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి మూడు పూటలా తీసుకుంటే బరువు తగ్గుతారు.
లెమన్ జ్యూస్:
1) కావలసినవి: నిమ్మకాయలు 2, ఉప్పు, తేనె
లెమన్ జ్యూస్ లో చిటికెడు ఉప్పు, తేనె కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకున్నట్లయితే.... చెడు కొలెస్ట్రాల్ దూరం చేసుకోవచ్చు.
అవకాడో జ్యూస్:
1) కావలసినవి: అవకాడో, తేనె
అవకాడోను గ్రైండ్ చేసి తేనె కలుపుకుని తాగితే పొట్టను తగ్గించుకోవచ్చు. ఇందులోని గుడ్ కొలెస్ట్రాల్ శరీరంలోని క్యాలరీల శాతాన్ని బర్న్ చేస్తుంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి ఇటువంటి చికిత్స/మందులు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్ ను సంప్రదించండి.